ఆధార్ కార్డు లో సమస్యలు ఉంటే ఇలా సులువుగా పరిష్కరించుకోండి..!

-

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి అవసరం. ప్రభుత్వ స్కీములు మొదలు ఆధార్ కార్డ్ అన్నింటికీ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు లో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే మీ ఆధార్ కార్డు లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా…?, మీరు వాటిని పరిష్కరించుకోవాలి అనుకుంటున్నారా..? అయితే 1947 నెంబర్ కి డయల్ చేయండి.

 

తాజాగా ఈ సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI తెలిపింది. ఈ నెంబర్ 12 బాషల్లో పని చేస్తుంది. 1947 ఆధార్ హెల్ప్లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీస్ మరియు ఉర్దూ భాషలలో సహాయపడుతుంది. 24/7 ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.

PVC ని ఇలా పొందండి:

కొత్త ఆధార్ PVC కార్డు కోసం ముందుగా యుఐడిఎఐ వెబ్ సైట్ ని ఓపెన్ చెయ్యండి.
ఇక్కడ ఆధార్ PVC కార్డుని సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
వర్చువల్ ఐడి లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని కూడా ఎంటర్ చేయాలి.
కోడ్ ని ఎంటర్ చేసి ఓటిపి దగ్గర క్లిక్ చేయండి.
ఆ తర్వాత మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది.
ఇక్కడ మీరు ఆధార్ PVC కార్డు ని చూడొచ్చు.
ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
పేమెంట్ పేజి దగ్గర 50 రూపాయలు డిపాజిట్ చేయండి.
ఒకసారి పేమెంట్ అయిపోయాక ప్రాసెస్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version