సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

-

మన దేశం లో నిత్య వసర వస్తువుల నుంచి… పెట్రోల్, డీజిల్‌ వరకు అన్నిటి ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పెట్రోల్ సెంచరీ దాటగా.. డీజిల్‌ ధరలు కూడా సెంచరీకి చేరువయ్యాయి. ఇక తాజాగా మరోసారి దేశం లో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ పై 35 పైసల్‌ మరియు లీటర్‌ డీజిల్‌ పై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.34 కు చేరగా డీజిల్ ధర రూ. 98.07 కు పెరిగింది. ముంబై లో రూ. 115.15 , కు చేరగా డీజిల్ ధర రూ. 106.23 కు పెరిగింది.

కోల్ కతాలో రూ . 109.79 కు చేరగా డీజిల్ ధర రూ. 101.19 కు పెరిగింది. చెన్నైలో రూ . 106.04 కు చేరగా డీజిల్ ధర రూ.102.25 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113. 72 కు చేరగా డీజిల్ ధర రూ. 106. 98 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115. 94 కు చేరగా డీజిల్ ధర రూ. 108. 55 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version