మన శరీరంలో రెండు కిడ్నీలు పని చేయడం చాలా అవసరం. ఏదైనా జబ్బు చేసి ఒక కిడ్నీ ఫెయిల్ అయితే మిగిలిన ఒక కిడ్నీ తో జీవించడం కొంచెం కష్టమే. కిడ్నీలు మన శరీరంలో ఉండే మలినాలు బయటకు పంపిస్తాయి. దాంతో పాటు కొన్ని లవణాలను, విటమిన్లను, ఎరిథ్రోపాయిటన్ అనే హార్మోన్ను నియంత్రిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం సరిగ్గా జరగకపోతే మన శరీరంలో సోడియం తగ్గిపోవడం మరియు పొటాషియం, పాస్ఫరస్ పెరగడం వంటివి జరుగుతాయి దాంతో గుండె జబ్బులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ లక్షణాలు ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది :
డయాబెటిస్
హై బీపీ
కిడ్నీలో రాళ్లు
యూరిన్ ఇన్ఫెక్షన్ లు
యూరిన్ లో రక్తం
క్రానిక్ కిడ్నీ డిసీజ్ సమస్య ఐదు దశలుగా ఉంటుంది. మొదటి దశలో కిడ్నీ పనితీరు 35 నుంచి 50 శాతం వరకు దెబ్బతింటుంది. లక్షణాలు ఎక్కువగా ఉండవు. ఇలా పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. రెండు, మూడు, నాలుగు దశలలో వేరే పరీక్షలు చేసుకున్నప్పుడు కిడ్నీ సమస్య బయట పడే అవకాశం ఉంది. ఐదో దశ చివరి దశ. ఈ దశలో ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఐదో దశ లో తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఎటువంటి కిడ్నీ సమస్య వచ్చినా నెఫ్రాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాలి. త్వరగా కిడ్నీ సమస్యలను గుర్తించకపోతే రక్తహీనత, ఎముకల బలహీనత, గుండె మరియు ఊపిరితిత్తుల నీరు చేరడం జరుగుతుంది. అలాంటప్పుడు డయాలసిస్ తప్పనిసరిగా చేయించుకోవాలి.