అమరావతి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా సున్నిత వ్యవహారం అనే విషయం క్రమంగా అర్ధమవుతుంది. రాజకీయ పార్టీలు దీన్ని వాడుకోవాలని చూస్తున్నాయనే దానికంటే రైతు స్వచ్చందంగా పార్టీలతో సంబంధం లేకుండా ముందుకి వస్తున్నాడు అనేది అర్ధమవుతుంది. రైతులు పోరాటం ఏ విధంగా ఉంటుందో కొంత మందికి ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. అమరావతి గురించి తక్కువ అంచనా వేసింది ప్రభుత్వం, అనే వ్యాఖ్య వినపడుతుంది.
రైతులు అమరావతిని రాజధానిగా ఉంచాలని పోరాట౦ చేస్తున్నారు బాగానే ఉంది. కాని ఇక్కడ కొందరు తమ నోటి దూలను ప్రదర్శిస్తున్నారు. సిని నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అసలు అతనికి మాట్లాడే అర్హత అమరావతి మీద ఏ మాత్రం లేదు. ఆయన ఒక సిని హాస్య నటుడు మాత్రమే కదా…? జగన్, పృథ్వీ కి పదవి ఇవ్వకపోతే అతను ఒక సిని నటుడు.
కాని రైతు గురించి ఆ విధంగా మాట్లాడటం మంచిది కాదు. ఇక జగన్ సొంత సామాజిక వర్గం ఈ విషయంలో సైలెంట్ గా ఉంటే మంచిది. సోషల్ మీడియాలో అమరావతి గురించి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే బెటర్. అమరావతి ఉన్న ప్రాంతం తాడికొండ ఎస్సీ నియోజకవర్గం. మరి మెజారిటి కమ్మ సామాజిక వర్గం ఏ విధంగా ఉంటుంది…? కాబట్టి కొంత మంది తమను తాము అదుపు చేసుకోకపోతే అంతిమంగా వాళ్ళు అభిమానిస్తున్న జగన్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి.