సుస్థిర ప్రశాంత రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణా పేరు జాతీయ స్థాయిలో వినపడుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విషయంలో తెలంగాణా ఒక్కటే ముందు వరుసలో ఉంది. ఏ నిరసనలు ఆందోళనలు లేకుండా, వివాదాలు లేకుండా తెలంగాణా రాష్ట్రం ప్రశాంతంగా సాగిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం ఉన్నా సరే, అక్కడ జరుగుతున్న కొన్ని ఆందోళనలు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుని ప్రభావితం చేస్తున్నాయి. ఎన్నార్సి విషయంలో అక్కడ హింస కూడా జరిగిన సంగతి తెలిసిందే.
ఇక తమిళనాడు విషయానికి వస్తే అక్కడ సుస్థిర ప్రభుత్వం లేదు. ఎప్పుడైనా అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న అన్నాడిఎంకేలో ఎప్పుడు ఎం జరుగుతుందో చెప్పలేము. ఇక కేరళ విషయానికి వస్తే ఎన్నార్సి, అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశం వంటివి వివాదాస్పదంగా మారాయి. హింస కూడా అక్కడ భారీగానే జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చి చూస్తే అమరావతి, సహా అనేక ఆందోళనతో ఆ రాష్ట్రం అట్టుడికిపోతుంది. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అనే చట్టం హాస్యమే.
ఏ విధంగా చూసుకున్నా సరే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటే టాప్ లో ఉంది. హైదరాబాద్ ఉండటంతో పాటు సుస్థిర ప్రభుత్వం, కెసిఆర్ పాలన, కేటిఆర్ ఆలోచనలతో రాష్ట్రం క్రమంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సంగతి అర్ధమవుతుంది. అందుకే దేశంలోనే ఇప్పుడు తెలంగాణా ప్రశాంత రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. రాష్ట్రంలో ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉన్నా సరే కెసిఆర్, ఎన్నార్సి విషయంలో వారిని అదుపు చేయగలిగారు. దీనితో పెద్ద ఆందోళనలు ఎక్కడా జరగడం లేదు. అందుకే తెలంగాణా ప్రశాంతంగా ఉంది.