మహారాష్ట్ర సర్కార్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. సూపర్ మార్కెట్లలలో కూడా వైన్ ను అమ్మాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. మహారాష్ట్ర ను శివసేన ప్రభుత్వం లిక్కర్ స్టేట్ గా మారుస్తుందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన వైన్ అమ్మకాల ప్రకటన పై శివసేన కీలక నేత సంజయ్ రౌతు సమర్థించారు.
వైన్ అనేది మద్యం రకానికి చెందినది కాదని ఆయన అన్నారు. వైన్ అనేది పూర్తిగా పండ్లతో తయారు చేస్తారని అన్నారు. వైన్ అమ్మకాలు పెరిగితే రైతులకే లాభం అని అన్నారు. రాష్ట్రంలో పండ్ల రైతులకు మేలు చేయాలనే ఉద్ధేశంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంజయ్ రౌత్ అన్నారు. వైన్ అమ్మకాలు పెరిగితే పండ్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అన్నారు. కాగ ప్రస్తుతం శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యల పై కూడా విమర్శలు వస్తున్నాయి.