వైసిపి ప్రభుత్వం తెచ్చినవి చెత్త జీవోలు అని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష నేత చంద్రబాబు హక్కులను కాలరాయడంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుప్పంలో జరిగిన సంఘటనలపై చంద్రబాబును పరామర్శించినట్లు తెలిపారు. వైసీపీ అరాచకాలపై మాట్లాడుకున్నామన్నారు.
రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఫ్లెక్సీలు వాడొద్దు అంటారని.. కానీ వైసిపి వాళ్లు మాత్రం యదేచ్ఛగా ఫ్లెక్సీలు కడుతున్నారని మండిపడ్డారు. రూల్ అందరికీ అప్లికేబుల్ అంటారు కానీ అమలు మాత్రం చేయడం లేదని ఆరోపించారు. మా మీటింగ్ లకు మేమే లాఠీలు పట్టుకోవాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచడానికి ఏం చేయాలి? పెన్షన్ల తొలగింపు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం అనే అంశాలపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్.