నాగచైతన్య తో ఉంటే ఆ ఫీలే వేరబ్బా.. కృతి శెట్టి..!!

-

నాగచైతన్య.. అక్కినేని వారసుడిగా యువ సామ్రాట్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య తన నటనతో ఈ మధ్యకాలంలో ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భార్య సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత ఈయన పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య తన కెరియర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని లవ్ స్టోరీస్ సినిమా ద్వారా సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నాగచైతన్య నటనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు. అప్పటివరకు నటనకు పనికిరాడు అన్న వాళ్ళు కూడా ముక్కున వేలేసుకోవడం జరిగింది.

ఇకపోతే బంగార్రాజు సినిమాలో కృతి శెట్టితో నాగచైతన్య జోడి చాలా బెస్ట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈ సినిమాలో వీరిద్దరూ కూడా హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది అని.. సినిమా సక్సెస్ తో మనకు అర్థమైంది. ఇకపోతే మరొకసారి ఈ జోడి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ప్రేక్షకులతో స్వయంగా కృతి శెట్టి తెలియజేస్తూ నాగచైతన్య తో తనకున్న అనుబంధాన్ని కూడా వెల్లడించింది.

#NC22 సినిమా అనౌన్స్మెంట్ ప్రకటించిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కృతి శెట్టి.. నాగచైతన్య పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక కృతి శెట్టి మాట్లాడుతూ.. నాగచైతన్యతో రెండవసారి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇక ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటారో. నాకు తనతో కలిసి పని చేసినప్పుడే అర్థమైంది . ఇక ఏ విషయంలో అయినా సరే చాలా నిజాయితీగా ఉంటారు . నాగచైతన్య ది స్వచ్ఛమైన మనసు.. ఆయన వ్యక్తిత్వం అందరికీ ఎంతో స్పూర్తినిస్తుంది అని తెలిపింది. అంతేకాదు నాగచైతన్యతో ఉంటే అదొక సరికొత్త రిప్రెష్ లుక్ అనిపిస్తుంది. ఆ ఫీలింగే వేరబ్బా అంటూ తన మనసులో ఫీలింగ్స్ ను తెలిపింది కృతి శెట్టి.

Read more RELATED
Recommended to you

Exit mobile version