రాజకీయాలు అనుకూలంగా ఉన్న, ప్రతికూలంగా ఉన్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలో మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గడం లేదు…టీఆర్ఎస్-బీజేపీలు రేసులో ముందున్నాయని విశ్లేషణలు వచ్చిన…కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోతుందని సర్వేలు వచ్చిన సరే రేవంత్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎన్ని సర్వేలు వచ్చిన…తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు…పైగా కాంగ్రెస్ పార్టీకి 90 లక్షల ఓట్లకు ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల్లో ఉండనని సవాల్ కూడా చేస్తున్నారు.
ఈ విధంగా దూకుడుగా ముందుకెళుతున్న రేవంత్…భవిష్యత్ లో పార్టీ బలం మరింత పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్, బీజేపీల్లో ఉన్న బలమైన నేతలని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. జంపింగులు వల్ల కాంగ్రెస్ బాగా నష్టపోయింది…సర్వేల్లో ఈ అంశమే ఎక్కువ కనబడుతోంది.
అందుకే అదే జంపింగుల వల్ల బలపడాలనేది రేవంత్ ప్లాన్ గా ఉంది…రెండు పార్టీలో ఉన్న బడా నేతలకు గాలం వేసి లాగేయాలని చూస్తున్నారు…ఇప్పటికే టీఆర్ఎస్ లోని తీగల కృష్ణారెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణరావు లాంటి బడా నేతలకు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీలో ఉన్న జితేందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఇతర ముఖ్య నేతలతో రేవంత్ టచ్ లో ఉన్నట్లు సమాచారం. వీరిని తెలంగాణకు రాహుల వచ్చిన సమయంలో కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. చూడాలి మరి రేవంత్ బడా గాలం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.