వాస్తు: బాత్ రూమ్ లో ఈ టిప్స్ పాటిస్తే సమస్యలే వుండవు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. అలానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి ఒక్క గదిలో కూడా తగిన వాస్తు చిట్కాలుని ఫాలో అవ్వాలి. అలాగే బాత్రూం కి సంబంధించి కూడా కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం గోడలకు ఎలాంటి రంగులు వేస్తే మంచిది..? ఎలాంటి టైల్స్ వేస్తే మంచిది అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి ఓ లుక్ వేసేయండి. బాత్రూం లో ఉండే గోడలకి తెలుపు, పింక్, లైట్ పసుపు వంటి రంగులని వేస్తే మంచిది. వీటిని వేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

అలాగే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇక టైల్స్ విషయానికి వస్తే.. లైట్ కలర్స్ వేసుకోవడం మంచిది. టైల్స్ కి ఎప్పుడూ కూడా డార్క్ కలర్స్ ఉండకూడదు. తెలుపు, నీలం రంగులు వేస్తే మంచిది. ఇది ప్రశాంతకరమైన లుక్ ను ఇస్తుంది. అలానే ఇబ్బందులు లేకుండా చూస్తుంది. నలుపు, ఎరుపు రంగులని అసలు వాడొద్దు. ఇలా ఈ విధంగా వాస్తు చిట్కాలని ఫాలో అయితే ఇంట్లో ఉండే సమస్యలను కూడా తొలగిపోతాయి. అలానే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news