లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఉంటే.. పెరుగు తినొద్దు.. ఇంకా ఇవి కూడా..

-

కొవిడ్‌ వచ్చిదంటే.. ఆ వ్యక్తి ఆయుష్షు తగ్గినట్లే.. ఎంతో జాగ్రత్తగా ఉండే తప్ప ఆరోగ్యం కాపాడుకోలేం. కోవిడ్‌ భారిన పడి కోలుకున్నాక కూడా ఏవేవో కొత్త రోగాలు. ప్రముఖ నటుడు కృష్ణం రాజు కూడా రెండు సార్లు కొవిడ్‌ భారిన పడ్డారు. లక్షలాది మంది మూడేళ్లుగా లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతూనే ఉన్నారు. పన్నెండు వారాలకు మించి కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నట్లు అర్థం.. లాంగ్ కోవిడ్ ఉన్న వారిలో అలసట, కళ్లు ఎర్రగా ఉండడం, తలనొప్పి, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెప్పాలంటే.. వీటికి సరైన చికిత్స ఇంకా లేదు. చేయాల్సిందల్లా ఆహారంలో మార్పు. ఏం తినాలి, ఏం తినొద్దు అని మాత్రమే వైద్యులు చెప్పగలగుతున్నారు. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు ఇవి తినొద్దట..

హిస్టామిన్ ఉన్న ఆహారాలు

హిస్టామిన్ ఉన్న ఆహారాలు తినడం వల్ల పరిస్థితి ఇంకా దిగజారుతుంది. హిస్టామిన్ అంటే అలెర్జీలను పెంచే రసాయనం. ఇది మన శరీరం నుంచి విడుదలవుతుంది. తుమ్ములు, దురదలు వచ్చేలా ప్రేరేపిస్తుంది. యాంటీ హిస్టమైన్స్ మందులు ఉన్నాయి. చాలా మందికి వైద్యులు వాటిని సూచిస్తున్నారు. హిస్టమిన్ కలిగిన ఆహారాలను దూరం పెట్టడం వల్ల కూడా లక్షణాల నుంచి బయటపడవచ్చు.

ఇవి తినవద్దు..

పెరుగు
బీరు
వైన్
చీజ్
కాల్చని చేపలు
రెడీ-టు-ఈట్ భోజనం
టిన్డ్ ఫుడ్స్
ప్రాసెస్ చేసిన మాంసాహారం
పులియబెట్టిన ఆహారాలు

ఏం తినాలి?

తాజాగా, ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. మిగిలిపోయిన అన్నం, కూరలు వంటివి తినడం మానేయండి.. నారింజ, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, మిరియాలు, బంగాళాదుంపలు వంటి వాటిలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. అలాగే ఎరుపు ఆపిల్, ద్రాక్ష, ఉల్లిపాయలు, బెర్రీ పండ్లను కూడా తింటే క్వెర్సెటివ్ అందుతుంది. ఆహారంలో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ తాజా ఆహారాన్నే తింటూ ఉండాలి. వ్యాయామం రోజూ కనీసం అరగంటైనా చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version