అనసూయ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ బుల్లితెరపై యాంకర్ గా మరింత పాపులారిటీ దక్కించుకుంది. సుమ తర్వాత అంతటి పాపులారిటీ దక్కించుకున్న యాంకర్ అనసూయ తనదైన నటనతో.. వాక్చాతుర్యంతో.. చలాకీగా కనిపిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై మంచి పొజిషన్ కి చేరుకున్న ఈమె ఫిలిం ఇండస్ట్రీలో ఎంత సంపాదించింది అనే వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. నిజానికి సినీ ఇండస్ట్రీలో సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక్కొక్కసారి స్టార్లుగా ఎదిగిన వారు కూడా తాము సంపాదించిన డబ్బునంత పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.

మరికొంతమంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కోట్లు కూడబెట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే యాంకర్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి.. నటిగా మారి.. ప్రస్తుతం కోట్ల ఆస్తిని సంపాదించింది అనసూయ. మరి ఈమె ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో దాదాపు రూ.8 కోట్లకు పైగా విలువ చేసే ఒక అందమైన ఇల్లు ఈమె సొంతం. అలాగే రెండు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వీటి విలువ సుమారుగా మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అలాగే హైదరాబాదులో కూడా మరికొన్ని ఆస్తులు ఉన్నట్లు సమాచారం . మొత్తంగా వీటి విలువ కలుపుకుంటే రూ.30 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

ఇలా భారీగా ఆస్తులను కూడబెట్టిందట అనసూయ. స్టార్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో సుమా తర్వాత ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ కూడా ఈమె కావడం గమనార్హం. అందుకే ఇంత ఆస్తులను కలిగి ఉంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈమె భర్త భరద్వాజ కూడా వ్యాపారవేత్తగా వ్యవహరిస్తూ కొన్ని కోట్ల రూపాయలను పోగు చేసినట్లు సమాచారం. ఇక వీరికి ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news