ఇలా చీపురుని మీ ఇంట్లో పెడితే… లక్ష్మి దేవి వెళ్ళిపోతుంది.. జాగ్రత్త..!

-

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చీపురు ఉంటుంది. చీపురు లేని ఇల్లు ఉండదు. చీపురుని మనం శుభ్రం చేయడానికి వాడుతూ ఉంటాము. ఇంట్లో ఎక్కడ మట్టి, దుమ్ము, దూళి వంటివి వున్నా కూడా చీపురుని మనం ఉపయోగించి ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు. అయితే చీపురు లక్ష్మీదేవితో సమానం అందుకనే చీపురుని కాలితో తన్నడం వంటివి చేయకూడదు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రం చేసుకునే గుడ్డ చీపురు విషయంలో పొరపాట్లు చేయకూడదు అటువంటి పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

ఇంట్లో చీపురుని పెట్టేటప్పుడు కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు అదేంటంటే చాలామంది చీపురు పాడైపోతుందని, చీపురు నిలబెడుతుంటారు. చీపురుని నిలబెట్టేటప్పుడు చీపురు తుడిచే భాగం ఎప్పుడూ కూడా కిందకి ఉండాలి. మనం చేతితో పట్టుకునే భాగం పైకి ఉండాలి. కానీ రివర్స్ లో పెడతారు చాలామంది. ఇలా కనుక మనం పాటించామంటే ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది.

అదేవిధంగా చీపురుని ఇంట్లో పెట్టినప్పుడు ఈశాన్యం మూలలో అసలు పెట్టకూడదు అలా చేయడం వలన ఇంట్లోకి మంచి రాదు. పైగా నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చీపురుతో ఒకరిని కొట్టడం చీపురుని కాళ్లతో తన్నడం అగౌరవపరచడం మంచిది కాదు. చీపురుని పెట్టేటప్పుడు కచ్చితంగా వీటిని పాటించాలి. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి చీపురుని నిలబెట్టేటప్పుడు వీటిని కచ్చితంగా పాటించండి ఒకవేళ కనుక మీరు చీపురు పాడైపోతుంది అలా నిలబడితే అని అనుకుంటే చీపురుని పడుకోబెట్టండి. ఇలా చేసినా కూడా చక్కటి ఫలితం కనబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news