యూఏఈ అంటేనే కఠిన చట్టాలకు పేరు గాంచింది. చిన్న చిన్న తప్పులకు కూడా కఠిన మైన శిక్షలు విధించే దేశాల లీస్ట్ లో యూఏఈ కూడా ముందు వరుసలోనే ఉంటుంది. తాజా గా యూఏఈ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట ఫోటోలు గానీ, వీడియోలు గానీ తీస్తే.. అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇలా రోడ్డు ప్రమాదాన్ని సెల్ ఫోన్ లలో బంధించడాన్ని అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఒక వేళ ఎవరైనా.. దీన్ని అతి క్రమిస్తే.. ఆరు నెలల జైలు శిక్ష లేదా.. రూ. 31 లక్షల నుంచి రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు.
అంతే కాకుండా పరిస్థితులను బట్టి ఒక్కో సారి ఈ రెండిటిని కూడా విధించే అవకాశం ఉంది. కాగ ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో సాయం చేయాల్సింది పోయి.. ఫోటోలను, వీడియోలను తీసి సోషల్ మీడియాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. దీన్ని నివారించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అనుమతి లేకుండా.. ఇతరుల ఫోటోలను, వీడియోలను తీసినా.. ఏడాది జైలు శిక్ష తో పాటు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని ప్రకటించింది.