బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా బరువు తగ్గొచ్చు.. బరువు తగ్గాలంటే ముందు పొట్ట తగ్గించాలి.. ఇది తగ్గితే ఆటోమెటిక్‌గా సన్నగా కనిపిస్తాం.. దాంతో మనకే ఉత్సాహం వచ్చి డైట్ కంటిన్యూ చేస్తాం. మరి పొట్ట తగ్గాలంటే ఏవేవో చేయక్కర్లా.. ఇప్పుడు చెప్పుకునేవి రోజు లేచిన తర్వాత పరగడుపునే తాగితే చాలు.. అన్నీ కాదండోయ్ ఏదైనా ఒకటి మాత్రమే..!! అవేంటంటే..
బ్లాక్ కాఫీ కొవ్వును కరిగించేందుకు ఉత్తమ పానీయం అని చెప్పవచేచు.. ఇది మీకు శక్తిని అందిస్తుంది. వ్యాయామానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అది కూడా ఉదయం పూటే. ఉపవాసం చేసే సమయంలో కూడా దీన్ని తాగొచ్చు. అస్సలు ఆకలి వేయదు.. నీరసం ఉండదు.
ఒక గ్లాసు నీటిలో రెండు నుంచి మూడు టీస్పూన్ల ఆపిల్ సిడర్ వెనిగర్ వేయాలి. ఆ నీటిని ఉదయాన ఖాళీ పొట్టతో తాగాలి. పరగడుపున తాగితేనే మంచి ఫలితం ఉంటుంది. మీ పేగులను శుభ్రపరచడానికి ఈ పానీయం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మీ pH స్థాయిని, మీ పొట్టలోని ఆమ్ల స్థితిని కూడా నిర్వహిస్తుంది. ఇది జీవక్రియ వేగాన్ని పెంచి కొవ్వు కరిగేలా చేస్తుంది. శరీరంలోని కొవ్వు మొత్తం కరిగే అవకాశం ఉంది.
గ్రీన్ టీ ఆరోగ్యానికి అందానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా గ్రీన్ టీ తాగాల్సిందే..చాలా మంది భోజనం తరువాత గ్రీన్ టీని తాగుతారు. ఇది చాలా తప్పు పద్ధతి. ఉదయం పూట ఖాళీ పొట్టతో తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గ్రీన్ జీవక్రియ వేగాన్ని పెంచి కొవ్వును కరిగిస్తుంది. సాయంత్రం దాటాక తాగకపోవడమే మంచిది. ఇది నిద్రరాకుండా అడ్డుకుంటుంది. గ్రీన్ టీ తాగాక ఒక గంట తరువాత అల్పాహారం చేయడం మంచిది.
సిట్రస్ పండ్లు అంటే నారింజ, నిమ్మ వంటివి. వీటిలో ఆమ్ల కంటెంట్ ఉంటుంది. ఇవి నేరుగా జీవక్రియను ప్రభావితం చేయవు. కానీ పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా చూసుకుంటాయి.. భోజనంలో భాగంగా దీన్ని తిన్నా మంచిదే. లేదా ఉదయం పూట జ్యూస్ రూపంలో తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
మంచి నీళ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పరగడుపున గ్లాసుడు నీళ్లు తాగడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరిగే అవకాశం ఉంది. నీళ్లు తాగాక గంట పాటూ ఏమీ తినకూడదు. వేడినీళ్లు తాగడం ఇంకా మంచిది. మలబద్ధకం సమస్య కూడా పోతుంది. కొవ్వు కరుగుతుంది.
వీటిల్లో మీకు ఏది తేలిగ్గా అనిపిస్తే దాన్ని 21రోజుల పాటు ప్రయత్నించి చూడండి. ఒకవేళ యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగాలనుకుంటే తగిన పరిమాణంలో మాత్రమే వెనిగర్ కలుపుకోవాలి. త్వరగా బరువు తగ్గాలని ఎక్కువగా వేసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి జాగ్రత్త..!