అక్కడ పానీపూరి తినాలంటే.. ఆధార్‌ కార్డ్‌ చూపించాల్సిందే ..!!

-

ఇండియా మొత్తం పానిపూరికి ఫ్యాన్స్‌ ఉన్నారు. వాటివల్ల రోగాలు వస్తున్నాయ్‌ అన్నా, అవి చేసే వాళ్లు హైజెనిక్‌గా ఉండరూ అన్నా.. ఆ పానీపూరి స్మెల్‌ చూడగానే అన్నీ మర్చిపోయి.. భయ్యా ఏక్‌ ప్లేట్‌ పానీపూరి అంటాం.. నిజానికి పానీపూరి టేస్ట్‌ చాలా బాగుంటుంది. దీన్ని తిండానికి జేబులో 20 రూపాయిలుంటే చాలు.. కానీ అక్కడ మాత్రం ఆధార్‌ కార్డ్‌ ఉండాలట.. అవును మీరు విన్నది నిజమే..! మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-భింద్ రహదారిలో ఉన్న ఓ బండి దగ్గర పానీపూరీలను తినాలంటే మాత్రం ఆధార్ కార్డును చూపించాలి. అంతే కాదు ఇక్కడ పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు గొల్గప్పలు తినిపించరు. 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇక్కడ పానీపూరీలు అమ్ముతారు. ఈ రూల్స్‌ ఏంట్రా అనుకుంటున్నారా..?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-భింద్ రహదారిలో ఛోటే లాల్ బఘేల్ భగత్ జీ గోల్గప్ప స్టాల్ నిర్వహిస్తున్నాడు. అక్కడ భగత్ జీ పానీపూరీ చాలా ఫేమస్.. దీన్ని రుచి చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అనేక మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా పాపులర్ అవడంతో దేశంలోని ఇతర నగరాల నుంచి ప్రజలు పానీపూరీను తినడానికి వస్తారు. అయితే ఇక్కడ 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి మాత్రమే పానీపూరి అమ్ముతారు. అందుకే ఆధార్‌ కార్డ్‌ చూసి మాత్రమే పానీపూరి ఇస్తాడట.. ఈ స్టాల్ దగ్గర పానీపూరీ తినాలంటే గొల్గప్ప ప్రేమికులు తమ ఆధార్ కార్డును తమ వెంట తీసుకురావాల్సిందేనట..అంతే కాకుండా ఇక్కడ పిల్లలు, మహిళలు, వృద్ధులకు పానీపూరీ అమ్మరు. స్టాల్ ఓనర్.. ఛోటే లాల్ బాఘేల్ ఈ విషయాన్ని స్టాల్‌పై రాశారు.
ఎందుకు అమ్మరంటే..తాను తయారుచేసిన మసాలా అవసరమైన దానికంటే ఎక్కువ ఘాటుగా ఉంటుందని, దీంతో మహిళలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే వారికి నా పానీపూరి అమ్మను అని లాల్‌ వివరించారు. దీనితో పాటు, గర్భిణీ స్త్రీలు తమ గొల్గప్పలను అస్సలు తినకూడదట… అతను పానీపూరీలో ఏం మసాలాలు వాడతాడు అనేది మాత్రం చెప్పలేదు.
తాను 20 ఏళ్లుగా ఈ బిజినెస్ లో ఉన్నానని, ఈ పనిలో ప్రజల నుండి ఎంతో ప్రేమను పొందుతున్నట్లు ఛోటే లాల్ బఘేల్ వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుండి ప్రజలు గొల్లగప్పలు తినడానికి తన దగ్గరకు వస్తారని, తన అభిమానులు చాలా మంది ఇతర జిల్లాల నుండి ఇక్కడికి పానీపూరీని ఆస్వాదించడానికి వస్తారని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version