రిటైర్ అయ్యాక డబ్బులు పొందాలంటే ఈ బిజినెస్ ఐడియాస్ బెస్ట్..!

-

చాలా మంది రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా రిటైర్ అయిపోయారా..?, ఏదైనా వ్యాపారం లాంటివి చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఇక్కడ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఒక లుక్ వేసేయండి.

 

లైఫ్ కోచ్ లేదా మెంటర్:

రిటైర్ అయిపోయారు అంటే మీరు జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. మీరు ఈ సక్సెస్ ని అందుకోవాలంటే ఎన్నో తెలుసుకునే ఉంటారు. మీరు కనుక లైఫ్ కోచ్ లేదా మెంటర్ అయితే మీరు ఎంతో మందికి మంచి పునాది వేయగలరు. వాళ్ల సక్సెస్ అందుకోవడానికి మీరు తోడుగా నిలిచి క్యాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎంతో హ్యాపీగా డబ్బులు సంపాదించవచ్చు.

ఫైనాన్సియల్ అడ్వైజర్:

బడ్జెట్, డబ్బులు మొదలైన ఎన్నో కీలక విషయాలను మీరు వాళ్లకి చెప్పి సలహాదారుడిగా మారొచ్చు ఇలా మీరు డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.

బ్లాగ్ లేదా పాడ్ కాస్ట్:

ఇప్పటి కాలంలో అంతా ఇంటర్నెట్ తోనే నడుస్తోంది. ఇటువంటి సమయంలో ఆన్లైన్ లో బ్లాగ్ లేదా పాడ్ కాస్ట్ ని మీరు మొదలు పెట్టారంటే ఖచ్చితంగా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. మీకు నచ్చిన సబ్జెక్టు మీద మీరు బ్లాగ్ ని చేసి నలుగురికి ఉపయోగకరంగా మీరు ఉండొచ్చు. అలానే మీరు కూడా నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.

కన్సల్టెంట్:

మీరు కన్సల్టెంట్ కింద కూడా పని చేయొచ్చు మీరు మీ కంటే చిన్న వయసు వాళ్ళకి, యువతకి మంచిగా సలహాలను ఇచ్చి కన్సల్టెంట్ కింద వర్క్ చేసి సంపాదించొచ్చు. ఇలా రిటైర్ అయ్యాక కూడా రిలాక్స్ గా మీకు తెలిసిన వాటితోనే డబ్బులు సంపాదించచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version