ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ కీలక ప్రకటన

-

ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఇవాళ నిర్వహించిన సీఎం జగన్‌….ఈ సందర్భంగా మాట్లాడుతూ…. కోవిడ్‌ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందని… గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గిందన్నారు. దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయిందని వివరించారు.

jagan

మొదటి త్రైమాసికంలో ఏకంగా 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయిందని వెల్లడించారు. 2020–21లో దేశ జీడీపీ 7.25శాతం మేర తగ్గితే… ఏపీలో 2.58 శాతానికి పరిమితమైందని జగన్‌ వివరించారు.  ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్‌ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని… వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణపంపిణీ చేశారన్నారు. పంట రుణాలు మాత్రం 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకంగా ఉందన్నారు. కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version