చాలామంది రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు కూడా సమస్యలతో సతమతమవుతుంటే ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండొచ్చు. గుమ్మడికాయతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది ఈ సమస్యలకి పరిష్కారం ఉంటుంది. దోషాలన్నీ కూడా పోతాయి. పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి అంటే కాలభైరవ స్వామికి చాలా ఇష్టం. ఆ రోజున కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన చేయడం వలన అనేక లాభాలను పొందొచ్చు.
ఇంట్లోనే మీరు దీనిని చేసుకోవాలి నరగోష ఆర్థిక సమస్యలు మొదలు దృష్టి దోషం వంటివి తొలగిపోతాయి. పిల్లలు మాట వినకపోయినా, నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ దీపారాధన చేయాలనుకునే వాళ్ళు బూడిద గుమ్మడికాయని మధ్య కి కోసేసి గుజ్జును తీసేసి పసుపు కుంకుమ దానికి పెట్టండి. తర్వాత నువ్వుల నూనె వేసి వెలిగించండి బూడిద గుమ్మడికాయ కి నమస్కారం చేసుకుని తల్లిదండ్రులను గురువుల్ని తలచుకోండి.
అలానే గ్రామ దేవతని చండీమాతని కూడా ఒకసారి తలచుకొని నమస్కారం చేసుకోండి ఇలా ఈ దీపారాధన చేయడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయి. సౌభాగ్యం కలుగుతుంది. 19 అమావాస్య రోజులలో కానీ 19 అష్టమి తిధుల రోజుల్లో కానీ ఈ దీపారాధన మీరు చేసుకోవచ్చు. ఇలా దీపారాధన చేస్తే చక్కగా అనేక లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా దిష్టి వంటి బాధలు ఏమి కూడా కలగవు పూజ అయిన తర్వాత ఎండు ఖర్జూరాలని నైవేద్యం పెట్టండి ఈరోజు ఉపవాసం చేస్తే కూడా చాలా మంచిది. భక్తిశ్రద్ధలతో మీరు ఇలా దీపారాధన చేస్తే నరదృష్టి వాస్తు దోషం వంటివన్నీ పోతాయి.