ఎక్కువగా స్క్రీన్స్ వలన కళ్ళు సురక్షితంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ని పాటించండి..!

-

ఈ మధ్యకాలం లో మనం ఎక్కువగా ఫోన్లకి, లాప్టాప్ లకి అలవాటు పడిపోయాం. పిల్లలకి ఆన్లైన్ క్లాసులు రావడం వల్ల లాప్టాప్ ని ఎక్కువగా చూస్తున్నారు. అలానే పెద్ద వాళ్ళు కూడా ఎక్కువ స్క్రీన్ ముందు సమయాన్ని గడుపుతున్నారు. నిజానికి స్క్రీన్ ల ముందు ఎక్కువ సేపు గడపడం వల్ల కళ్ళు స్ట్రైన్ అవుతూ ఉంటాయి. కంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. దీనితో కంటి ఆరోగ్యం బాగుంటుంది.

 

ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ని సరైన దూరంలో ఉంచుకోండి:

బాగా దగ్గరగా లాప్టాప్ లని పెట్టుకోవడం వల్ల కళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతాయి. సరిగ్గా డిస్టెన్స్ చూసుకుని వాటిని సెట్ చేసుకోండి. మీ కళ్ళకి మీ స్క్రీన్ కి ఒక చేతి దూరం ఉండాలి. ఇలా ఎడ్జస్ట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. లేదంటే మీకే సమస్య కలుగుతుంది.

పొజిషన్ మరియు బ్రైట్నెస్ చూసుకోండి:

మీ స్క్రీన్ పొజిషన్ ని బ్రైట్నెస్ని చేసుకోండి. మీకు కంఫర్ట్ గా ఉండేటట్లు చూసుకోండి. ఎక్కువ బ్రైట్నెస్ వల్ల కూడా కళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటిని మీరే సెట్ చేసుకోండి.

బ్రేక్ తీసుకుంటూ ఉండండి:

అలా రోజంతా మీరు వాటి ముందు కూర్చునే కంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం మంచిది. ఇలా మీరు బ్రేక్ తీసుకుంటే కంటికి అంత ఇబ్బంది కలగదు.

నాచురల్ లైట్ కింద వర్క్ చేయండి:

మీరు లైట్లు వేసుకునే కంటే నేచురల్ వెలుతురులో కూర్చుని పని చేసుకుంటే మంచిది. దీని వల్ల కూడా కంటి సమస్యలు ఉండవు.

పెద్ద ఫాంట్ ఉపయోగించండి:

అక్షరాలు సైజులు చిన్నవిగా కాకుండా పెద్దగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే కంటికి సంబంధించిన వ్యాయామాలను చేయడం వల్ల కూడా కంటికి ఇబ్బంది కలగదు.

పని చేసేటప్పుడు మధ్య మధ్యలో కళ్ళు మూయండి:

అలా గ్యాప్ లేకుండా మీరు స్క్రీన్లను చూడకండి. మధ్యమధ్యలో కనురెప్పలు వేస్తూ ఉండండి. ఇలా ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే కచ్చితంగా కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version