వైఎస్ జగన్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ సవాల్ చేశారు.జూన్ 9న సీఎ జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారన్న వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ మళ్లీ గెలిస్తే ముఖ్యమంత్రికి ఆహ్వనం పలుకుతూ తిరుపతి నుంచి విశాఖ వరకూ పోస్టర్లు అంటిస్తానని అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ఓడిపోబోతోందని, బెట్టింగులు కోసం ఆ పార్టీ నేతలు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ,ఓటమి భయంతో ట్రాప్ చేస్తున్నారని తెలిపారు. ఓడిపోతున్నారనే తెలిసి.. బెట్టింగులు కాసి కోట్లు కొట్టేయొచ్చని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పే మాటలు నమ్మి ఆ పార్టీ గెలుపుపై ఎవరూ బెట్టింగులు వేయకూడదని అన్ని సర్వేలు కూటమికే అనుకూలంగా ఉన్నాయని కిరణ్ రాయల్ తెలిపారు.