Breaking : ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగింది

-

ప్రతిభావంతుడైన విద్యార్థి అతడు. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో ట్రిపుల్‌ఐటీలో.. సీటొచ్చి.. కోటి ఆశలతో క్యాంప్‌సలోకి అడుగు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తల్లిదండ్రుల మధ్య గొడవలు ఆ విద్యార్థిని లోలోపల ఇబ్బంది పెడుతున్నాయి!.. చివరికి అదే కారణంతో మనస్తాపం చెంది తనువు చాలించాడు!!. ‘నా చావుతోనైనా అమ్మానాన్నలు కలిసి ఉండాల’ని ఆశిస్తున్నానంటూ చివరి సారిగా లేఖ రాసి మృత్యుఒడికి జారుకున్నాడు. ‘నేను ఇలా ఆత్మహత్య చేసుకోవడం తప్పే, కానీ తప్పలేదు. దయచేసి అర్థం చేసుకోగలరూ..ఇప్పటికైనా ఇద్దరూ కలిసి ఉండి మాట్లాడుకోండి. ఇదే నా చివరి కోరిక అనుకోండి’.అని సూసైడ్‌ నోట్‌ రాసి ట్రిపుల్‌ ఐటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లా ఇడుపులపాయలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన నాగభూషణం, ఇరావతి దంపతుల కుమారుడు శ్రీఈశ్వరసాయి (17) ఇడుపులపాయి ట్రిపుల్‌ ఐటిలో పియుసి-2 చదువుతున్నాడు.

గురువారం క్లాస్‌కు వెళ్లకుండా హాస్టల్‌ గదిలోనే ఉండిపోయాడు. ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగి వచ్చిన విద్యార్థులు హాస్టల్‌ గది తలుపులు మూసి ఉండటాన్ని గమనించారు. తలుపులు కొట్టినా తీయకపోవడంతో వారు ట్రిపుల్‌ఐటి అధికారులకు సమాచారమిచ్చారు. ఫ్యాన్‌కు ఉరేసుకుని శ్రీఈశ్వరసాయి కన్పించడంతో వెంటనే ఇడుపులపాయలోని ఆస్పతికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆత్మహత్య విషయాన్ని ఉరవకొండలోని తల్లిదండ్రులకు డైరెక్టర్‌ సంధ్యారాణి తెలియజేశారు. పోలీసులు ట్రిపుల్‌ ఐటికి చేరుకుని మృతుని గదిని పరిశీలించారు. విద్యార్థి రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమకు ఎలాంటి కుటుంబ సమస్యలు లేవని, ట్రిపుల్‌ఐటిలో టీచర్లు పెట్టే మానసిక ఒత్తిడి వల్లే చనిపోయాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version