ఇల్లందులో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆగడాలు.. మైనర్లకు గంజాయి అమ్ముతూ..!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికార కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య అండదండలు చూసుకుని ఇల్లందు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఈసం లక్ష్మణరావు దారుణాలకు ఒడిగడుతున్నట్లు తెలుస్తోంది. ఇల్లందులోని మైనర్లకు గంజాయి అమ్ముతున్నట్లు అతనిపై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన మాటలు వినలేదని ఈసం లక్ష్మణరావు అడవిలో శ్రవణ్ అనే వ్యక్తిని బంధించి విచక్షణా రహితంగా కొట్టినట్లు సమాచారం.

దాడి చేస్తున్న టైంలో వీడియో తీయించి మరీ పైశాచిక ఆనందం పొందినట్లు తెలుస్తుండగా.. అందుకు సంబంధించిన వీడియో విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా తమకేం సంబంధం లేదన్నట్లు వదిలేసినట్లు టాక్. ఎమ్మెల్యే అండ చూసుకుని మైనర్లే టార్గెట్‌గా విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే కోరం కనకయ్య పేరు చెబుతూ ఈసం లక్ష్మణ్, కమల్ అనే వ్యక్తులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం. దాడి చేసిన వీడియో జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version