మెగా హీరోకి అనారోగ్యం.. సినిమా మరింత ఆలస్యం..?

-

ప్రస్తుతం మెగాహీరో సాయిధరమ్తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం మెగాహీరో సాయిధరమ్తేజ్ అనారోగ్యం బారిన పడ్డారు అన్న టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోంది. సాయి ధరంతేజ్ అనారోగ్యం బారిన పడటం కారణంగానే… ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు రావడం లేదని… అందుకే సినిమా డబ్బింగ్ మరింత ఆలస్యం అవుతుంది అని టాలీవుడ్ టౌన్ లో గుసగుసలు వినిపిస్తుంది.

అక్టోబరు 1 నాటికి సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ… అనారోగ్యం కారణంగా సాయి ధరంతేజ్ డబ్బింగ్ చెప్ప లేక పోవడంతో… ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సాయి ధరంతేజ్ ఎందుకు అనారోగ్యం బారిన పడ్డారు అన్న విషయం మాత్రం బయటకు రావడం లేదట . ఏదేమైనా మెగాహీరో సాయిధరమ్తేజ్ అనారోగ్యం బారిన పడ్డారు అంటూ టాక్ వినిపిస్తుండటంతో ప్రస్తుతం మెగా అభిమానులందరూ టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news