బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయువ్యం దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కర్ణాటక కోస్తా ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఉంటుందని, 23, 24 తేదీల్లో అక్కడ కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
తూర్పు, ఈశాన్య భారతంలో ఈనెల 24, 25న వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య భారతంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.