మహిళలూ.. ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాల్సిందే..!

-

మహిళలు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చాలా మంది మహిళలు రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం పాడవుతుంది. అయితే మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలన్నా ఈ ఆహార పదార్థాలని తప్పక డైట్ లో చేర్చుకోవాలి అప్పుడు మహిళల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు మరి ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం… వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

కూరగాయలలో, సిట్రస్ ఫ్రూట్స్ లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో సమస్యలు ఏమి కలగకుండా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు. ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్ ని డైట్లో చేర్చుకోండి. ద్రాక్ష ఆరెంజ్ బెర్రీస్ వంటి వాటిని తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు.

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి. ఫైబర్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఉదర సంబంధిత సమస్యలను ఫైబర్ దూరం చేస్తుంది. మీరు తినే ఆహారం బాగా జీర్ణం అయ్యేటట్టు చూస్తుంది. అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే కూడా ఫైబర్ కచ్చితంగా తీసుకోవాలి. గింజల్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ వుండండి. గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మొదలైన పోషక పదార్థాలు ఉంటాయి. గుమ్మడి గింజలు, ఫ్లేక్ సీడ్స్ వంటి వాటిని రోజు తీసుకుంటూ ఉండండి అప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

డైరీ ప్రొడక్ట్స్ తో కూడా ఆరోగ్యం బాగుంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. పాలు పెరుగు బట్టర్ మిల్క్ వంటివి తరచూ తీసుకుంటూ ఉండండి. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాయి. పోషక పదార్థాలు డ్రై ఫ్రూట్స్ లో కూడా ఎక్కువగా ఉంటాయి. శక్తిని పెంచుకోవచ్చు. వాల్నట్స్, ఖర్జూరం మొదలైన వాటిని తీసుకుంటూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version