నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 21వ స్నాతకోత్సవం వేడుకలో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పతకాలను రాష్ట్రపతి అందించారు. పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ, పీజీ డిప్లోమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉత్తీర్ణులైన 592 మంది పట్టభద్రులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానోత్సవం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. నిష్పాక్షికమైన న్యాయం అందించాలి అన్నారు. ముర్మున్యాయం కోసం మహాత్ముడు పోరాడాడు. మన దేశంలో న్యాయ సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి అని తెలిపారు.