తెలంగాణ సచివాలయం వద్ద సెక్షన్ 163 అమలు

-

తెలంగాణలో వివిధ బెటాలియిన్లకు చెందిన కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.‘ఏక్ పోలీస్.. ఏక్ స్టేట్’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చూస్తూ గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 49 మంది టీజీఎస్‌పీ (TGSP) సిబ్బందిపై పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.అందులో 39 మందిపై సస్పెన్షన్ వేటువేయగా.. మరో 10మందిని పూర్తిగా సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే ఏక్ పోలీస్ విధానంతో పాటు సిబ్బందిపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్ల పరిధిలోని కానిస్టేబుళ్లు సోమవారం మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారు.దీంతో సచివాలయ ముట్టడికి కానిస్టేబుళ్లు ప్రయత్నించే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం పార్కింగ్ గ్రౌండ్‌‌లో దాదాపు 200 మంది పోలీసులను ఒకే చోట మోహరించారు.ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో కూడా మరికొంత మందిని మోహరించారు.సచివాలయం చుట్టూ సెక్షన్-163ని అమలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news