ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. SAPNET ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు SAPNET ను ఎత్తివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్.
అంతేకాదు.. ఇప్పటి వరకు ఉన్న SAPNET ఉద్యోగులను APSCHE కి బదిలీ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 2018లో ఏర్పాటైన SAPNET..ను చంద్రబాబు నాయుడు సర్కార్ రద్దు చేసింది. ఇక అటు ఎన్టీఆర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలపై సర్కార్ సీరియస్ గా ఉంది. స్థానిక మైన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. నందిగామలోని కంచల, పెండ్యాలలో సీనరేజ్ వసూలు చేయవద్దని చెప్పినా తవ్వకాలు జరుపుతున్నట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్. భారీ యంత్రాలతో మునేరులో తవ్వ కాలు చేస్తున్నట్టు గుర్తించడంతో సర్కార్ సీరియస్ అయింది.