పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ క‌స్ట‌మ‌ర్ల‌కు ముఖ్య‌మైన వార్త‌.. మినిమం బ్యాలెన్స్‌పై కొత్త రూల్‌..

-

పోస్టాఫీస్‌లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా.. అయితే ఈ వార్త‌ను మీరు క‌చ్చితంగా చ‌ద‌వాల్సిందే. ఎందుకంటే పోస్టాఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్‌ను క‌లిగిన‌ క‌స్ట‌మ‌ర్ల‌కు గాను ప‌లు నూత‌న నియ‌మాల‌ను ఇండియా పోస్ట్ అమ‌లులోకి తెచ్చింది. డిసెంబ‌ర్ 11 నుంచి ఈ రూల్స్ వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. ఈ మేరకు ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది.

ఇక‌పై పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ క‌స్ట‌మ‌ర్లు త‌మ ఖాతాల్లో రూ.500 క‌చ్చితంగా ఉంచాలి. ఆ మేర మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాలి. లేదంటే రూ.100 + జీఎస్‌టీ క‌లిపి ఫైన్ వేస్తారు. ఇక ఏడాది పాటు అకౌంట్‌లో నిల్ బ్యాలెన్స్ ఉంచితే అకౌంట్‌ను ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిన‌ట్లు భావించాలి.

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ల‌లో క‌స్ట‌మ‌ర్లు రూ.10 కనీస బ్యాలెన్స్ ఉంచాలి. గ‌రిష్టంగా ఎంతైన బ్యాలెన్స్ పెట్టుకోవ‌చ్చు. అలాగే రూ.500 క‌న్నా త‌క్కువ మినిమం బ్యాలెన్స్ ను మెయింటెయిన్ చేస్తే అకౌంట్ లోంచి డ‌బ్బుల‌ను విత్‌డ్రా చేసేందుకు వీలు ఉండ‌దు. ఇక 3 ఏళ్ల పాటు అకౌంట్ల‌లో ఎలాంటి లావాదేవీలు జ‌ర‌ప‌క‌పోతే స‌ద‌రు అకౌంట్‌ను డోర్మంట్ అకౌంట్‌గా నిర్దారించి క్లోజ్ చేస్తారు. అయితే అలాంటి అకౌంట్ల‌ను మ‌ళ్లీ యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. అందుకు గాను క‌స్ట‌మ‌ర్లు తాజా కేవైసీ ప‌త్రాల‌ను, పాస్‌బుక్‌ను అంద‌జేయాల్సి ఉంటుంది. వాటితోపాటు అప్లికేష‌న్ ఫాంను నింపి ఇస్తే అలాంటి అకౌంట్ల‌ను తిరిగి యాక్టివేట్ చేస్తారు. ఈ రూల్స్ ను క‌స్ట‌మ‌ర్లు పాటించాల్సి ఉంటుంద‌ని ఇండియా పోస్ట్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version