హోలీ గురించి చాలా మందికి తెలియని ముఖ్య విషయాలివి.. తప్పక చూసేయండి మరి…!

-

హోలీ పండుగ నాడు పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ ఆడుతూ ఉంటారు. రంగులు, రంగు నీళ్ళని జల్లుకుంటారు హోలీ రంగుల పండగ అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒకరికి ఇష్టమే.

ఈరోజు అందరూ సరదాగా గడుపుతారు అలానే ఇంటికి స్నేహితులని కూడా రమ్మని పిలుస్తారు. మంచి ఆహార పదార్థాలని పంచుకుని తింటారు. హోలీ నడు చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి మరి ఇక ఆలస్యం ఎందుకు వాటికోసం చూసేద్దాం.

హోలీ పండుగ బావ మరదళ్ల ఆట:

హోలీ రోజున అందరూ రంగులు జల్లుకుంటారు కానీ బావ మరదళ్ళు మామ కోడలు వరుస అయినా వాళ్లు ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ ఉంటారు.

హిందువుల పండగ:

ఇండియాలోనే కాదు ఈ హిందూ పండుగ నేపాల్ లో కూడా జరుపుకుంటారు నిజానికి హోలీ పండుగ అనేది ఒక హిందూ పండగ. ఫాల్గుణ పౌర్ణమి నాడు హోలీ పండుగ వస్తుంది ఈ సంవత్సరం మార్చి 8న వచ్చింది.

కర్రలతో కొట్టుకుంటారు:

హోలీ పండగ నాడు ఉత్తర ప్రదేశ్ లోని బర్సానా దగ్గర మహిళలు పురుషులని కర్రలతో కొడతారు సరదాగా యుద్దంగా పాల్గొంటారు. మగవాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇక్కడ పాటలని కూడా పాడతారు.

విదేశాల్లో హోలీ:

విదేశాల్లో కూడా హోలీ జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల హోలీ పండుగ జరుపుతారు.

ఇక్కడ పూలు జల్లుకుంటారు:

మామూలుగా హోలీ నాడు అని చోట్ల రంగులేని చల్లుకుంటారు. మధుర లో బృందావనంలో మాత్రం పువ్వుల్ని జల్లుకుంటారు.

డోల్ పూర్ణిమ:

దేశంలో కొన్ని చోట్ల అందంగా ఉయ్యాలని అలంకరించి రాధాకృష్ణుల విగ్రహాలని దాని మీద ఊరేగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version