నేతలందరూ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పోరాడాలి – మాణిక్ రావు ఠాక్రే

-

నేతలందరూ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్ రావు ఠాక్రే. ప్రతీ ఇంటికి రాహుల్ గాంధీ సందేశం చేరాలన్నారు. ప్రతీ ఇంటికి హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించాలన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నేతలందరూ కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు మాణిక్ రావు. మండల స్థాయి నేతలు హాత్ సే హాత్ జోడో ను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 15 రోజుల మళ్లీ వచ్చి మరోసారి సమావేశం నిర్వహిస్తానన్నారు. జిల్లాలలో నిర్వహించే సమావేశానికి పార్టీ అనుబంధ విభాగాలన్నింటిని పిలవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version