మీకు రివర్స్ గేర్‌లో వెహికల్ నడపడం రాదా..? అయితే కష్టమే. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని భావిస్తే.. కచ్చితంగా రివర్స్ గేర్‌లో వెహికల్‌ను నడుపవలసి ఉంటుంది. ఇలా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే..? కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే యోచన తో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగం గానే రూల్స్ కూడా కాస్త స్ట్రిక్ట్ గా చేస్తోంది.
ఇలా చేయడం వలన రానున్న రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరెంత కష్టం. ఈ విషయాన్నీ పార్లిమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని భావిస్తే కచ్చితంగా రివర్స్ గేర్ లో వెహికల్‌ను నడుపవలసి ఉంటుందిట.
ఒకవేళ అలా చెయ్యలేదు అంటే లైసెన్స్ రావడం చాలా కష్టం. రివర్స్ గేర్ లో వెహికల్‌ను నడుపవలసి ఉంటుంది. అది కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఇష్టానుసారంగా వెహికల్ నడిపితే టెస్ట్ ఫెయిల్ అయినట్లే గమనించండి. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్‌కు వచ్చిన వారు కచ్చితంగా రివర్స్ గేర్ లో నడపాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లలో RTO డ్రైవింగ్ లైసెన్స్ పాస్ పర్సంటేజ్ 69 శాతానికి తగ్గింది.