గూగుల్ లో బికారి అని కొడితే పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఫొటోలు..! ఎంజాయ్ చేస్తున్న నెటిజ‌న్లు..!

-

కాశ్మీర్ అంశంపై ఓవరాక్ష‌న్ చేస్తున్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌పై భార‌త నెటిజ‌న్లు తీవ్రంగా ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్ బిచ్చ‌మెత్తుతున్న‌ట్లుగా ఉన్న ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి వాటికి బికారి అని పేరు పెట్టి పెద్ద ఎత్తున నెట్‌లో పోస్ట్ చేస్తున్నారు.

కాశ్మీర్‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే ఆర్టిక‌ల్ 370తోపాటు ఆర్టిక‌ల్ 35ఎ ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే ర‌ద్దు చేసిన విషయం విదిత‌మే. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ లోలోప‌ల తెగ బాధ‌ప‌డిపొతోంది. ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ విష‌యం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు విష‌యాన్ని అంత‌ర్జాతీయ వేదిక‌ల‌లో చ‌ర్చించి భార‌త్‌ను ఇబ్బంది పెట్టాల‌ని ఇమ్రాన్ య‌త్నించారు. కానీ ఆయ‌న ప‌ప్పులేమీ ఉడ‌క‌లేదు.

కాశ్మీర్ అంశంపై భార‌త్‌ను ఇరుకున పెట్టాల‌ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ చేస్తున్న య‌త్నాలేవీ ఫ‌లించ‌డం లేదు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కాశ్మీర్ విష‌యంలో జోక్యం చేసుకోలేమ‌ని, పాకిస్థాన్ భార‌త్‌తో కూర్చుని ఆ విష‌యంపై చర్చించుకోవాల‌ని తాజాగా సూచించారు. ఇక మొన్నీ మ‌ధ్యే ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో పాక్ చైనా స‌హాయంతో భార‌త్‌పై మాట‌ల దాడి చేసేందుకు య‌త్నించినా.. భార‌త్ దాన్ని ముందుగానే ప‌సిగట్టి పాక్ కుతంత్రాన్ని తిప్పి కొట్టింది. దీంతో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు.

అయితే కాశ్మీర్ అంశంపై ఓవరాక్ష‌న్ చేస్తున్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌పై భార‌త నెటిజ‌న్లు తీవ్రంగా ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇమ్రాన్‌ఖాన్ బిచ్చ‌మెత్తుతున్న‌ట్లుగా ఉన్న ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి వాటికి బికారి అని పేరు పెట్టి పెద్ద ఎత్తున నెట్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో గూగుల్‌లో ఇప్పుడు బికారి (bhikari) అని సెర్చ్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ బిచ్చ‌మెత్తుతున్న‌ట్లుగా ఉన్న ఫొటోలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక ఆ ఫొటోల‌ను భార‌త నెటిజ‌న్లు విప‌రీతంగా షేర్ చేస్తూ తెగ ఆనంద‌ప‌డిపోతున్నారు. ఈ మేర‌కు వారు ఇమ్రాన్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ ట్రోల్ చేస్తున్నారు.

కాగా గ‌తంలోనూ గూగుల్ సెర్చ్‌లో ఇడియ‌ట్ అని టైప్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ పేరు వ‌చ్చింది. దీంతో అప్ప‌ట్లో గూగుల్ సీఈవో ఆ అంశంపై వివ‌ర‌ణ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ బ‌గ్ వ‌ల్లే అలా జరిగింద‌ని, తాము దాన్ని స‌రిచేశామ‌ని అన్నారు. ఇక ఇప్పుడు ఇమ్రాన్ ఫొటోలు ఇలా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రి దీనిపై ఆయ‌న ఎలా స్పందిస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version