వైసీపీకి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ రాజీనామా చేసారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. తాజాగా తన రాజీనామా లేఖను ఇచ్చారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
కొన్ని నెలల క్రితం ప్రజాసేవే లక్ష్యంగా ముఖ్యంగా కర్నూల్ లోకి పేదవాల్కు సేవ చేయాలనీ.. ఐఏఎస్ నుండి VRS తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున MLA అభ్యర్థిగా పోటీ చేశాను. అయితే ఎన్నికల ఫలితాలు ఏంటి అనేది మీ అందరికి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఇంట్లో వాళ్ళతో.. నానా బంధుమిత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాను. అదే రాజకీయాలకు దూరంగా ఉండాలని. అయితే నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను కానీ.. ప్రజాసేవకు కాదు అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.