ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు… నేడు కొత్తగా 9,275 పాజిటివ్ కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా తీవ్రరూపం దాలుస్తోంది. గత రెండు రోజులు రోజుకి పది వేల కేసులు పైన నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కోవిడ్19 కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా విడుదల చేసింది. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 60,797 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 9,275 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయాయి. నేటి నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా 1,50,209 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 72,188 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

ap-corona

ఇక మరోవైపు గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 ,750 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రిల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా వైరస్ బారినపడి 58 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1407 కు చేరుకుంది. కరోనా వైరస్ ఉద్ధృతి ఆపేందుకు రాష్ట్ర అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో 1234 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నేటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 21,271 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version