70ఏళ్ల ప్రాయంలోనూ 200మందికి ఉచిత మార్షల్​ఆర్ట్స్​ శిక్షణ..!

-

శాస్త్ర సాంకేతికత రాజ్యమేలుతున్న నేటి తరంలో ప్రాచీన యుద్ధకళను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాడో వ్యక్తి. తాపీపనితో ఓ పక్క కుటుంబాన్ని పోషిస్తూనే.. తనకు తెలిసిన విద్యను మరో తరానికి అందించాలని లక్ష్యంగా పని చేస్తున్నాడు. ఇందుకోసం సుమారు 200 మందికి తర్ఫీదునిస్తున్నాడీ పెద్దమనిషి.

Marshal arts training

వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ.. అయినా మార్షల్​ ఆర్ట్స్​లో ఆయన దిట్ట. వయసు పైబడినా తనలో ఏమాత్రం సత్తువ తగ్గలేదని నిరూపిస్తున్నాడో 70 ఏళ్ల పెద్దమనిషి. కుటుంబ పోషణ కోసం బేల్దార్​గా పనిచేస్తూ రోజుకు రూ. 800 సంపాదిస్తూనే.. మరోపక్క మార్షల్​ ఆర్ట్స్​ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశాడు తమిళనాడుకు చెందిన గణపతి మురుగేశన్​.రామేశ్వరంలో సుమారు 200 మంది పిల్లలకు.. ‘సిలంబం’ అనే మార్షల్​ ఆర్ట్స్​ను ఉచితంగా నేర్పిస్తున్నాడు మురుగేశన్​. కనుమరుగై పోతున్న ఈ కళను రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా మురుగేశన్ శిక్షణ ఇస్తున్నారు​. ఇందుకోసం రోజుకు రెండుసార్లు తరగతులను నిర్వహిస్తున్నాని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version