కరోనా విజృంభణ కొద్దిగా తగ్గిన ప్రస్తుత సమయంలో సీరో సర్వే విషయాలు ఆసక్తి గొలుపుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో సీరో సర్వే ప్రకారం 16శాతం మందికి కరోనా ప్రతిరక్షాలు ఏర్పడ్డాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి సుధాకర్ వెల్లడించారు. అంటే ఆ రాష్ట్రంలో 16శాతం మందికి కరోనా వచ్చిపోయిందన్న మాట. సెప్టెంబరు 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరిగిన ఈ సర్వేలో 30జిల్లాలలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల వారికి టెస్ట్ నిర్వహించారు.
ఈ సర్వే 18సంవత్సరాలు, ఆ పై వయసున్న వారి మీద మాత్రమే జరిగింది. దీనికి రాపిడ్ టెస్ట్ తో పాటు ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ కూడా వాడారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు సూచనల ప్రకారమే సీరో సర్వే జరిపామని, మొత్తం 16,585 మందిపై సర్వే జరిగిందని, అందులో 16.4శాతం మందికి కరోనా ప్రతిరక్షకాలు ఉన్నాయని ఆరోగ్య శాఖ మంతి కె సుధాకర్ వెల్లడించాడు. సీరో సర్వే ప్రకారం ఢిల్లీలో 29.1 శాతం, ముంబైలో( మురికి వాడలు కాకుండా) 16శాతం మందికి కరోనా ప్రతిరక్షకాలు ఏర్పడ్డాయి.