ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. మట్టి దిబ్బల కింద ఉన్న వారిని కనిపెట్టేందుకు ప్రత్యేకమైన డిటెక్టర్‌లను అధికారులు ఉపయోగించినట్లు తెలిసింది. మృతదేహాల ఆనవాళ్లు లభించిన ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. జీపీఆర్ మార్కింగ్ చేసిన దగ్గర 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలను ఉన్నట్లు గుర్తించారు.
మరికొన్ని గంటల్లో నాలుగు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీయనుంది. టన్నెల్ బయట ఫోరెన్సిక్, వైద్య బృందాలు ఉండగా.. మృతులను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు. కాగా, మరోచోట 7 మీటర్ల లోతులో మరో నాలుగు మృతదేహాలను గుర్తించగా.. వాటిని బయటకు తీయడం సాధ్యం కాదని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పేర్కొన్నట్లు తెలిసింది.