ఆడుకుంటున్న పిల్లలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పిల్లలకు ప్రాణాప్రాయం తప్పగా.. గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఈ భయానక ఘటన ఢిల్లీలోని పర్యటన విహార్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. పర్యటన విహార్‌లో స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్ సెల్లార్ వద్ద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. అది కాస్త పార్కింగ్ స్థలం కావడంతో పిల్లలు ఆడుకుంటున్న విషయం గమనించకుండా ఓ కారు డ్రైవర్ వాహనాన్ని వారి మీదుగా పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో చిన్నారులకు గాయాలైనట్లు సమాచారం. అయితే, డ్రైవర్లు టర్న్ చేయకముందే పరిసరాలు గమనించాలని, 360 డిగ్రీ కెమెరా వాడితే అలర్ట్ చేస్తుందని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన కారు..
పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న పిల్లలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఢిల్లీలోని పర్యటన్ విహార్ లో ఈ ఘటన జరిగింది. పిల్లలు రోడ్డుపై ఆడుకుంటుండగా అటుగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులకు గాయాలయ్యాయి. ఈక్రమంలో డ్రైవర్లు టర్న్… pic.twitter.com/vwJBoYrJBt
— ChotaNews App (@ChotaNewsApp) March 1, 2025