విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కలకలం…సెల్‌ఫోన్‌ తీసుకుని హుండీలో వేశారు !

-

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కలకలం నెలకొంది…సెల్‌ఫోన్‌ తీసుకుని హుండీలో వేశారు అధికారులు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో…సెక్యూరిటీ చాలా అలర్ట్‌ అయ్యారు. సెల్ ఫోన్ తో ఆలయంలోకి వస్తే అమ్మవారి హుండీలో వేస్తున్నారు. సోమవారం రాత్రి అమ్మవారి ఆలయంలో మరో సెల్ ఫోన్ ఘటన నెలకొంది.

In the Durgamma temple of Vijayawada there was a commotion…they took the cell phone and put it in the hundi

అమ్మవారి మూలవిరట్టు ఫోటో తీసేందుకు ప్రయత్నించాడు ఓ భక్తుడు. ఈ తరుణంలోనే… సెక్యూరిటీ అలర్ట్ అవడంతో పరుగు పెట్టాడు భక్తుడు. అనంతరం భక్తుడిని పట్టుకుని సెల్ ఫోన్ హుండీలో వేశారు అధికారులు. ఆ సెల్ ఫోన్ ను ఏం చేయాలో హుండీ లెక్కింపు సమయంలో నిర్ణయిస్తారంటున్నారు అధికారులు. సెక్యూరిటీ చెక్ లో లోపాలపై ఇప్పటికే జరుగుతోంది విచారణ. మెటల్ డిటెక్టర్లు పెట్టాలని ఇటీవల సూచించింది సెక్యూరిటీ ఆడిట్ టీం.

Read more RELATED
Recommended to you

Exit mobile version