కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్నాలు కంపు కొడుతున్నాయి : కేటీఆర్

-

కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు.

“పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారింది. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయి. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే.. ?? దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యం? కాంగ్రెస్ పాలనలో.. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే.. ఇక పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ఉందా ?? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం మీ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం.. మీ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోకండి.” అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version