ఇక్కడ ఆడపిల్ల పుడితే పండగే…!

-

ఇంట్లో వాళ్ళు అంత మళ్ళీ మగ పిల్లవాడు పుట్టాలనే కోరుకోవడం… ఆడపిల్ల పుడితే మళ్లీ పుట్టిందా..? అన్న మాటలు వినడం మామూలు అయిపోయాయి. ఆడపిల్లకి అవమానాలు వంటివి ఇంట్లో, సమాజంలో కూడా చాలా ఉంటాయి. కడుపులో ఉన్నప్పుడే నుసిమేయడం వంటివి ఎన్నో చూసాం.అయితే ఈ ఊర్లో మాత్రం ఆడబిడ్డ పుడితే పండగ చేసుకుంటారు కేవలం కుటుంబం చేసుకుంటే దానిలో వింతేమీ లేదు కానీ ఊరు ఎక్కడ పండగ చేసుకుంటారు. అలానే ఆ ఊర్లో అమ్మాయిలుకి గౌరవం కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా..? మన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం లో హరిదాస్ పూర్.

girl-child
girl-child

ఈ ఊరు చాలా చిన్నది కానీ ఈ ఊరుని చూసి చాలా మంది గొప్ప పాఠం నేర్చుకున్నారు అని చెప్పాలి. అంత గొప్పది ఈ ఊరు ఆడపిల్ల వద్దు బాబోయి అనుకున్న రోజుల్లో కూడా మాకు ఆడపిల్ల పుట్టేట్టు చూడు దేవుడా…! అని వేడుకుంటారు ఈ ఊరు గ్రామస్తులు. మహిళలపై దాడులు అవమానాలు చేయడం వీళ్ళు కనక చూస్తే బాధ పడతారు. అయితే ఊరంతా కూడా ఆడపిల్లలే కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆడబిడ్డను కాపాడుకోవడమే లక్ష్యంగా చాటింపు వేసి ఊళ్ళో ఎవరికి ఆడబిడ్డ పుట్టినా వాళ్ళు పండగ చేసుకుంటారు.

పుట్టబోయేది ఆడపిల్ల అయితే బాగుండు అని వేడుకుంటూ ఉంటారు. అయితే హరిదాస్ పూర్ లో 90% అబ్బాయిలే ఉండేవారు ఎక్కడ చూసినా ఆడబిడ్డలు కనిపించ లేకపోయేది అయితే ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని ఆందోళన చెందారు అందుకే వాళ్ళు అప్పటి నుంచి కూడా ఆడపిల్లల సంరక్షణకు కంకణం కట్టుకున్నారు. ఎవరికి ఆడబిడ్డ పుట్టిన పంచాయతీ నుంచి కొంత డబ్బు ఇవ్వాలని తీర్మానం చేశారు. దీనిని జనవరి 1 , 2020 నుంచి అమలు చేశారు.

అయితే ఈ తీర్మానం జరిగిన తర్వాత సత్యవతి నగేష్ లకి పండంటి ఆడ బిడ్డ పుట్టింది. ఆ తర్వాత మరొక దంపతులకి కూడా ఆడబిడ్డ జన్మించింది. భానోత్ సంగీతకు అమ్మాయి పుట్టాలని కల కూడా నెరవేరింది. పంచాయతీ ఆఫీస్ కు రంగులు వేసి లైట్లతో అలంకరించారు ఊరంతా. ఆ తర్వాత ఆడ బిడ్డ తల్లిదండ్రులు సన్మానించారు. ఇలా ఆడబిడ్డ పుడితే సంబరాలు చేసుకుంటున్నారు ఈ ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news