ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది.. ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది.. మరెన్ని సెంటర్స్ లో 100రోజులు పూర్తిచేసుకుంది అనేది ఆ హీరో యొక్క స్టామినాని, ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ప్రామాణికంగా చూసేవారు. అనంతరం ఆదికాస్తా… ఎన్ని కోట్లు కలెక్షన్స్ సాధించింది అనే రూపానికి మారింది. ఎన్ని కోట్లు వసూళ్లకు పాల్పడింది అనేదానిపైనే ఆ హీరో స్టామినాని అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తితో ఆ లెక్కలు మారిపోయాయి!
ఫస్ట్ లుక్ యూట్యూబ్ లో ఎంతమంది చూశారు.. టీజర్ కు ఎన్ని వ్యూస్ వచ్చాయి.. ఫోటోకి ఎన్ని లైక్ లు వచ్చాయి, మరెన్ని షేర్లు వచ్చాయని అనేదానిపైకి మళ్లింది. తాజాగా ఇప్పుడు ట్వీట్లు, ఫాలోవర్లతో ఆ హీరో స్టామినాను అంచనావేయ లెక్కలేస్తున్నారు నెటిజన్లు! మరీ ఎక్కువగా ఖాళీగా ఉండటం వల్లో లేక వీరాభిమానంలో భాగమో తెలియదు కానీ… ప్రస్తుతం ఆపనికి పూనుకున్నారు నెటిజన్లు!
అందులో భాగంగా… #NTRBdayFestBegins కి 8.5 మిలియన్ ట్వీట్స్.. #AdvanceHBDMaheshBabu కి 8.6 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి.. #HappyBirthdayNTR కి 21.5 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి. ఈ క్రమంలో జూలై 13న బర్త్ డే జరుపుకోబోయే పవన్ కల్యాణ్ కోసం ట్విట్టర్ లో కొత్త రికార్డులు నెలకొల్పాలని సెల్ఫ్ ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్! ఇందులో భాగంగా వారి టార్గెట్ 25లక్షల బర్త్ డే ట్వీట్స్ అంట! మరి ఈ ట్విట్టర్ రికార్డుల వార్ లో పవన్ నిలుస్తారా, గెలుస్తారా అన్నది వేచి చూడాలి మరి!! ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన యాష్ ట్యాగ్ #PSPKAdvBdyTrendOnJuly13th గా ఉంది!