వినాయక చవితి పండుగ ఏర్పాట్లు రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బొజ్జ గణనాధులు ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ప్రతి గల్లీలో రంగురంగుల మండపాలు, డిస్కో లైటింగుల వెలుగులు విరజిమ్ముతున్నాయి. మొత్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది.ఈసారి తెలంగాణలో ఖైరతాబాద్ గణేశుడు 70 అడుగుల ఎత్తుతో ఈ ఏడాది హైలెట్‌గా నిలిచాడు. ఖైరతాబాద్‌లో వినాయకుడిని ప్రతిష్టించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి భారీ ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే, గణపతి విగ్రహాన్ని ఏ దిశలో ప్రతిష్టించాలో చాలా మంది యువతకు తెలీదు.వాస్తు ప్రకారం వినాయకుడిని తూర్పు దిశలో ప్రతిష్టిస్తే మంచి శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. తూర్పున సాధ్యం కాకపోతే ఉత్తరం వైపు ప్రతిష్టించాలని చెబుతున్నారు. అయితే, యుముడి స్థానం అయిన దక్షిణం వైపునకు మాత్రం ఎప్పుడూ ప్రతిష్టించకూడదని శాస్త్రం తెలిసిన వారు స్పష్టంచేశారు.