ఏపీ యూత్ కు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు..ఆ పిచ్చి పనులు మానుకోండి అంటూ చురకలు అంటించారు వీసీ సజ్జనార్. ఏపీకి చెందిన ఓ యువకుడు… ఆర్టీసీ బస్సును ఆపి.. ఎక్కలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ ఎందుకు ఆపాడో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. ఈ సంఘటనపై ఏపీ యూత్ కు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? అంటూ నిలదీశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు. లైక్ లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండని హెచ్చరించారు. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండని కోరారు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.