యశ్‌ టాక్సిక్‌ మూవీలో.. ఇద్దరు ముద్దుగుమ్మలు!

-

మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో హీరో యశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్ కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి క్రేజీ న్యూస్ నెట్టింట్లా చక్కర్లు కొడుతుంది. ఇక ఈ మూవీలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ యశ్‌కి జోడిగా నటిస్తున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ అండ్ సలార్ మూవీ హిట్ తో మంచి ఊపులో ఉన్న శ్రుతిహాసన్‌ పేరును కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల సాయిపల్లవి, కరీనా కపూర్‌ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు కొత్తగా వీరిద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే శృతి హాసన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో టాక్సిక్ చిత్రంలో కనిపించే భామల పేర్లు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్‌ ఈ చిత్రంపై అంచనాలు పెంచేలా ఉంది. ఏప్రిల్ 10, 2025న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఈ వీడియోలో తెలిపారు. ఈ ఒక్క వీడియో మూవీపై ఇప్పటినుండే భారీ అంచనాలను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news