చెన్నై సూపర్ కింగ్స్ కి తమిళనాడు అభిమానులు సపోర్ట్ చేస్తుండగా ముంబై ఇండియన్స్ కి మహారాష్ట్ర ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా ఎవరి రాష్ట్రానికి చెందిన టీంను ఆ రాష్ట్రానికి చెందిన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు కానీ మన తెలంగాణ విషయానికి వస్తే అలా లేదు. హైదరాబాద్ కి టీమ్ ఉన్నప్పటికీ ఇతర జట్లకే తెలుగు అభిమానులు సపోర్ట్ చేస్తుంటారు.
ఈక్రమంలో యాంకర్ విషిక విడుదల చేసిన వీడియో వైరలవుతోంది. ‘ప్రాంతీయ అభిమానం మనకు ఉండొద్దా? మనకు టీమ్ ఉందని మర్చిపోయారా? కోహ్లి, ధోనీ, రోహిత్లు అంటే నాకూ ఇష్టమే. కానీ, మన టీమ్ని మర్చిపోయే అంత కాదు అని అన్నారు. మనం రెండు సార్లు ఛాంపియన్స్’ అని ఆమె గుర్తు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ లో కూడా ఇండియా స్టార్ ప్లేయర్లుండాలని కామెంట్స్ చేస్తున్నారు.కాగా, ఐపీఎల్ 17వ సీజన్ రేపు అనగా మా చిర రెండవ తేదీన ప్రారంభం కానుంది. ఇక తొలి పోరులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పోటీ పడుతున్నాయి.