శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి వద్ద ఉదృక్తత

-

శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి వద్ద ఉదృక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించారు. మెగా డిఎస్సీ ముద్దు ..మినీ డిఎస్సీ వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్మాన ప్రసాదరావు ఇంట్లో కి వెళ్లే ప్రయత్నం చేసారు.

వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనీతో పోలీసులకు కాంగ్రెస్ యూత్ లీడర్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి ధర్మాన ఇంటి వద్ద బైటాయించి ప్లేకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్ కు పోలీసులు తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news