రోగ నిరోధక శక్తిని సులభంగా ఇలా పెంచుకోండి..!

-

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యాము. అందుకని దాని నుండి బయటపడడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు మరొకసారి ఓమైక్రాన్ వేరియంట్ వచ్చింది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ బయటపడాలని ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారు.

 

ఇంకా మనకి ఈ వైరస్ లేనప్పటికీ కూడా ముందు నుండి కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల రోగాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు. అయితే మనం సులువుగా రోగనిరోధక శక్తి ఎలా పెంపొందించుకోవాలి అనేది చూద్దాం. ఈ పద్ధతులని ప్రతిరోజు ఫాలో అయితే కచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

పోషకాహారం తీసుకోవడం:

పోషకాహారం తీసుకోవడం వల్ల తప్పక రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బ్రోకలీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, పాలకూర, వాల్ నట్, గ్రీన్ టీ మొదలైన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. అలానే రోగనిరోధక శక్తిని పెంచడానికి అశ్వగంధ, తులసి తిప్పతీగ బాగా ఉపయోగపడతాయి.

హైడ్రేట్ గా ఉండండి:

నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తి పై కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి. అలానే డిహైడ్రేషన్ సమస్య లేకుండా చూసుకోండి.

ఒత్తిడి లేకుండా ఉండడం:

ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఒత్తిడి లేకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి.

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం:

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి బాగుంటుంది. సర్క్యులేషన్ కూడా బాగా జరిగేటట్టు వ్యాయామం చూస్తుంది కాబట్టి ప్రతిరోజు వీటిని అనుసరించి ఇమ్యూనిటీని పెంపొందించుకోండి. దీంతో ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version